Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Farmers | రైతు పంటలకు లాభసాటి ధర చెల్లించాలి.

Farmers | రైతు పంటలకు లాభసాటి ధర చెల్లించాలి.

  • పి సుగుణాకర్ రావు

రైతు పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు జీవనో పాది కొరకు వెళ్తున్నారనికిసాన్ జాగరణ్.అధ్యక్షులు పి సుగుణాకర్ రావు అన్నారు. మన దేశంలో ఇప్పటికీ వ్యవసాయం ఆధారంగా దాదాపు 70 శాతం మంది ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని 50% పైగా జనాభా కి ప్రత్యేక ఉపాధి కల్పిస్తున్నారని ఇలాంటి ప్రాముఖ్యత గల రంగాన్ని విస్మరించడం దురదృష్టకరమని వివరించారు

దేశంలోనే 70 శాతం మంది ప్రజల ఆర్థిక పరిస్థితి జీవన ప్రమాణాలు పెరిగిందే వికసిత్ భారత్ సాధ్యం కాదని తెలిపారు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమని తెలిపారు ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం రైతు పంటకు లాభదాటిదారా ఆ పంట రైతుకు దక్కేందుకు దానికి చట్టబద్ధత ఏర్పరచవలసిన అవసరం ఉందని తెలిపారు.

- Advertisement -

కేవలం నినాదాలకు పరిమితం కాకుండా రైతాంగ సమస్యల పరిష్కారం ఆచరణాత్మక ప్రణాళికలు రచించాలని దానికి ప్రధానం రైతు పంటకు లాభ సాటిదారు పొందటమే మార్గమని తెలిపారు ప్రముఖ రైతు నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ అధిక క్రిమిసంహారక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుందని మన పంటల్లో వాటి అవశేషాలు మిగిలి అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని క్యాన్సరు కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఎటాక్సు హైపర్ టెన్షర్ట్స్ లాంటి అనేక జబ్బులకు కారణం అవుతుందని అందుకనే మనం సేంద్రియ ఎరువును వాడవలసిన అవసరం ఉందని తెలిపారు మరొక ప్రముఖ రైతు నాయకులు నరసింహనాయుడు మాట్లాడుతూ…

రైతులు సంఘటితమై ఉద్యమించింది ప్రభుత్వాలు దిగిరావని మేము నిజామాబాద్ జిల్లాలో సంఘటితంగా పసుపు బోర్డు సాధించుకున్నామని అలాగే రైతుకున్న అనేక సమస్యలకు సంఘటితమై ఉద్యమించటమే ఒకటే మార్గం అని తెలిపారు కె.వికే శాస్త్రవేత్త వేణుగోపాల్ మాట్లాడుతూ హార్టికల్చర్ పూలతోటల పెంపకం వల్ల రైతులకు అనేక లాభాలు గ్రహించని మేము అన్ని రకాలుగా సహకారం సిద్ధంగా ఉన్నామని తెలిపారు

రైతు నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి వల్ల లాభాలు గ్రహించమని తెలిపారు అధ్యక్షులు నేలమడుగు శంకరయ్య మాట్లాడుతూ దాము చింతకుంటలో ఎక్కువగానే విజయవంతంగా నడుపుతున్నామని అదే దారిలో మిగతా గ్రామ రైతులు కూడా సంఘటితం కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఈఓ అధ్యక్షులు పలువురు రైతు నాయకులు పాల్గొని రైతునుద్దేశించి అనేక సలహాలు సూచనలు ఇచ్చారు

ఈరోజు కిసాన్ గ్రామీణ మేల రైతు సాధికారకతకై రైతు పంటలకు లాభ సాటి ధర ఆ ధర రైతు పొందుటకై చట్టబద్ధత అలాగే రైతు పంట నష్టపోతే ఆ పరిణామంలో పరిహారం అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక ఎఫ్ఈఓ ఏర్పాటు చేసి రైతులను సంఘ టీత తపరచడం వృద్ధాప్య రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ చెల్లించడం లాంటి తీర్మాలను ఈరోజు కిసాన్ గ్రామీణ మేళాలో రైతులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 ఎపిఓల అధ్యక్షులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు రైతు నాయకులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News