- మన డిఫెన్స్ వ్యవస్థలో కొత్త శక్తి.. ఇక శత్రు దేశం తప్పించుకోలేదు
- ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న రాజ్నాథ్ సింగ్
- లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ సందర్శన
- భారత్ క్షిపణి సామర్ధ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య
పాక్ గతాన్ని మరచి ప్రేలాపనలు పేలితో చావుదెబ్బ తప్పదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఆపరేషన్ సింధూరంను మరచిపోయి మాట్లాడొద్దని హెచ్చరించారు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనని మరోమారు దాయాది పాక్ని హెచ్చరించారు. బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన నేపథ్యంలో శనివారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు.
ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇక్కడ తొలివిడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసించారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశం తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడి బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండుదేశాలతో రూ.4వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి నిపుణులు లక్నోకు తరలివస్తారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3వేల కోట్లు అవుతుంది. ప్రతి ఏటా రూ.5 వేలకోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుందని వెల్లడించారు.
