Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణరియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఎంపీ ఈటల

రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఎంపీ ఈటల

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై ఆలత చేయి చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్‌లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్‌ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, రద్దయిన ఏకశిల వెంచర్లో రియల్‌ బ్రోకర్స్‌ అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల బ్రోకర్లపై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News