Thursday, March 5, 2026
Homeబిజినెస్EPFO | ఉద్యోగుల ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతం..

EPFO | ఉద్యోగుల ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతం..

  • తెలియజేసిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) వరుసగా మూడో ఏడాది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 2025-26 సంవత్సరం కోసం 8.25 శాతంగా ఖరారుచేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 2024-25 సంవత్సరం కోసం వడ్డీ రేటును 8.25 శాతంగా ఈవీఎఫ్‌వో కొనసాగించింది. 2022-23లో 8.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2023-24 సంవత్సరానికి 8.25 శాతానికి స్వల్పంగా పెంచిన ఈపీఎఫ్‌వో వరుసగా మూడో సంవత్సరం కూడా ఇదే రేటును కొనసాగించింది.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో సోమవారం సమావేశమైన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని జమచేయాలని సిఫార్సు చేసినట్లు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News