Monday, March 2, 2026
Homeవరంగల్‌Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చదివాము చదువులమ్మ చెట్టు నీడలో అనే సినీ గేయాన్ని తలపించే విధంగా 2001-2002 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు.

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు రాములు, ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, రావు మనోహర్, రామ్మూర్తి, నర్సింగ్, విద్యార్థి విద్యార్థులు అరిగెల రామకృష్ణ, తొర్రి లక్ష్మణ్ యాదవ్, బైర్రాజు, ఉడుతల రాజు, నాల బాల రాజేందర్, గాలి దేవేందర్, ఓం ప్రకాష్, సుజాత, కల్పన, విజయ, రజిత, కవిత, వంగ దేవేందర్, రాజకుమార్, పొడిశెట్టి వాసు, గాలి రవి, ఒగ్గు ఒగ్గు మల్ల ప్రభాకర్, మూలం లింగమూర్తి, చిర్ర మహేందర్, మధుకర్ సలీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News