Sunday, February 22, 2026
Homeఆంధ్రప్రదేశ్Diary Release | ‘ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’ డైరీ విడుదల

Diary Release | ‘ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్’ డైరీ విడుదల

సీనియర్ జర్నలిస్ట్ ఐ. వెంకటరావు రాసిన ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ (A Tale of Two States) డైరీని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆవిష్కరించారు. విలీనం-విభజన (Vileenam Vibhajana) అనే తెలుగు పుస్తకానికి ఇది ఆంగ్ల అనువాదం. ఎన్.అనురాధ ట్రాన్స్‌లేట్ చేశారు. ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) ఏకీకరణ (Unification) నుంచి విభజన (Bifurcation) వరకు జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలను వివరిస్తుంది.

బూరుగుల రామకృష్ణారావు నుంచి ప్రస్తుత తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి వరకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 22 మంది సీఎంల సమగ్ర ప్రొఫైల్స్ (CMs Profiles) ఇందులో ఉండటం విశేషం. ఈ పుస్తకం తెలుగు ప్రజాదరణ పొందంది. ఆంగ్ల అనువాదం ఇతర భాషల పాఠకులు, పరిశోధకులు, ఈ ప్రాంత చరిత్రపై ఆసక్తి ఉన్న భవిష్యత్ తరాలకు విలువైన రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రజా జీవితాన్ని, రాజకీయ చరిత్రను వివరించడంలో సీనియర్ జర్నలిస్టుల కృషిని ప్రతిబింబిస్తుందని పేర్కొంటున్నారు.

- Advertisement -

రచయితను, అనువాదకురాలిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ డైరీ.. సమకాలీన చరిత్రకు అద్దంపడుతోందని ప్రశంసించారు. ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చినందుకు అనురాధను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఐ.వెంకటరావు, అనువాదకురాలు ఎన్.అనురాధ, రచయిత, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్, ప్రచురణకర్తలు ఐ. వేణు, ఐ.రఘు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News