ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి ఉద్యోగులు, పెన్షనర్లు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనం. పీఆర్సీ, డీఏలు, రిటైర్మెంట్ బకాయిలు – ఏదీ సమయానికి చెల్లించకపోవడం కేవలం నిర్లక్ష్యం కాదు, అమానవీయం. పాలనకు ప్రాణవాయువులాంటి ఈ వర్గాన్ని పక్కనపెట్టి, ప్రజాధనాన్ని వృథాగా పంచిపెట్టడం అసలు న్యాయం కాదు. 2024 నుంచి రిటైర్ అయిన వారు రెండేళ్లు గడిచినా తాము దాచుకున్న పొదుపు మొత్తాలను కూడా పొందలేకపోవడం దారుణం. ఈ ఆర్థిక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పలువురు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి మాయని మచ్చ. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి, రాజకీయ పక్షాల నిరసనను, న్యాయస్థానాల సూచనలను గౌరవించి ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేసి, మానవీయ దృక్పథంతో చిత్తశుద్ధిని చాటండి.
- మేదాజీ
