Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో ఎన్నికలు 2026లో

బంగ్లాదేశ్‌లో ఎన్నికలు 2026లో

ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు

షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్న బంగ్లాదేశ్‌లో జనరల్ ఎలక్షన్స్‌ను 2026లో నిర్వహించనున్నారు. ఆ సంవత్సరంలోని ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్ తెలిపారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను ఎన్నికల సంఘం రానున్న రోజుల్లో రూపొందించనుంది.

దేశ చరిత్రలోనే అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో, న్యాయబద్ధంగా, పోటీతత్వంతో కూడిన, అంగీకారయోగ్యమైన ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిందని తెలిపారు. ఎన్నికల సంస్కరణ కార్యకలాపాలపై సమీక్ష అనంతరం జాతీయ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇదిలాఉండగా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News