Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Green Hydrogen | ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు

Green Hydrogen | ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్టాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె.విజయానంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు (Advisory Board) తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంబంధిత ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వయిజరీ కమిటీ చర్చించింది. ముఖ్యంగా 2030 నాటికి ఏపీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామి(Top)ని చేయాలనే లక్ష్యం(Target)తో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్‌(Declaration)ను ప్రకటించడంతోపాటు ప్రత్యేకంగా ఒక అడ్వయిజరీ కమిటీని ఏర్పాటుచేయడం జరిగింది. 2027 నాటికి 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్(Electrolyzer) తయారీ సామర్థ్యం ఏర్పర్చడం, 2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News