Monday, October 27, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంMaster Minds | ‘మైండ్ గేమ్’పై విద్యాశాఖ మౌనం!

Master Minds | ‘మైండ్ గేమ్’పై విద్యాశాఖ మౌనం!

విద్యార్థుల ప్రాణాలతో ఆటలు..!
ఎంఈఓ జవాబు అవినీతి బట్టబయలు..!
నిబంధనల ఉల్లంఘనపై అధికారుల మౌనం ప్రజల్లో ఆగ్రహం..!
రెసిడెన్షియల్ పర్మిషన్‌తో నడుస్తున్న పాఠశాల..!
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా తరగతులు..!
ప్రమాదం జరిగితే రక్షణ ఎవరు..?
రోడ్డుపైనే బస్సులు రక్షణ ఎక్కడ..?
స్పీడ్ బ్రేకర్లు లేవు, జీబ్రా లైన్స్ లేవు స్కూల్ జోన్ బోర్డు కూడా లేదు..!
ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్ రౌడీయిజం..!
ఫోన్ లాక్కొని ఆధారాలు డిలీట్..!
ఎంఈఓ వివరణ సిగ్గుచేటు..!
క్రీడా మైదానం ఎక్కడ అంటే.. ఉంది కానీ అటు దూరంగా ఉంది అంటూ దాటవేత..!
విద్యార్థుల భద్రత ఎక్కడ..?

సిద్దిపేట పట్టణంలోని మాస్టర్ మైండ్స్ (Master Minds) పాఠశాల నిర్వాహకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పిల్లల భద్రత(Security)ను పణంగా పెట్టి నడుస్తున్న ఈ పాఠశాల వ్యవహారాలపై విద్యా శాఖ (Education Department) అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం తల్లిదండ్రుల్లో (Parents) తీవ్ర ఆగ్రహం రేపుతోంది. రెసిడెన్షియల్ (Residential) భవనానికి అనుమతి పొందిన భవనంలోనే పాఠశాల (School) నడపడం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy Certificate) లేకుండా తరగతులు (Classes) నిర్వహించడం చట్టరీత్యా నేరమని (Crime) నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగితే విద్యార్థులకు రక్షణ లభించే అవకాశం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు.

రోడ్డుపైనే విద్యార్థుల రాకపోకలు..!

స్కూల్ ముందు ప్రధాన రహదారిపైనే బస్సులను నిలిపి విద్యార్థులను ఎక్కించడం, దింపడం ప్రతిరోజూ జరుగుతోంది.
అంత పెద్ద రోడ్డు ఉన్నా అక్కడ స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా లైన్స్, స్కూల్ జోన్ బోర్డులు ఏవీ లేవు. పిల్లలు రోడ్డుపైన ప్రమాదానికి గురైతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఎంఈఓ సమాధానం హాస్యాస్పదం..!

పాఠశాలకు అవసరమైన క్రీడా మైదానం ఎక్కడ? అని అడిగితే ఎంఈఓ ఇచ్చిన సమాధానం ప్రజల్లో నవ్వులు పుట్టిస్తోంది. స్కూల్ భవనానికి కొంచెం దూరంలో ఉంది” అని చెప్పి తాను కూడా నిబంధనల ఉల్లంఘన అంగీకరించారు..? క్రీడా మైదానం దూరంగా ఉంటే విద్యార్థులను ప్రతిరోజూ ఎవరు తరలిస్తారు? వారి భద్రత ఎవరికి భాధ్యత? అన్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదు.

నిజాన్ని బయటపెట్టినవారిపై దౌర్జన్యం..!

స్కూల్ అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్న ఒక యువకుడిని ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. ఫోన్ లాక్కొని, వీడియోలను బలవంతంగా డిలీట్ చేసి, “మా స్కూల్ గురించి చూస్తావా?” అంటూ బెదిరించడం ప్రిన్సిపాల్ దౌర్జన్యానికి నిదర్శనం. ఇలాంటి వ్యవహారాలు విద్యాసంస్థ ప్రతిష్టను తాకట్టు పెట్టే చర్యలే అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

విద్యాశాఖ, పురపాలక శాఖ మౌనం ప్రశ్నార్థకం..!

ఈ వివాదంపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మాస్టర్ మైండ్స్ పాఠశాల అనుమతిని వెంటనే రద్దు చేయాలి..!

ఆక్యుపెన్సీ లేని భవనంలో తరగతులు నిర్వహించినందుకు క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఫోన్ లాక్కొని ఆధారాలు ధ్వంసం చేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి. ఎంఈఓ, డీఈఓపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లల భద్రతా ప్రమాణాలు పూర్తి కాకపోతే పాఠశాల మూసివేయాలి.

తల్లిదండ్రులకు హెచ్చరిక:

మీ పిల్లలు చదువుతున్న పాఠశాలకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, స్కూల్ జోన్ సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయా లేదా తప్పనిసరిగా తనిఖీ చేయండి. విద్య అంటే కేవలం బోధనే కాదు భద్రత కూడా ముఖ్యం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News