Wednesday, October 29, 2025
ePaper
Homeబిజినెస్గుడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి

గుడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి

పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం

మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్‌ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ ఇండియా, ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ మాట్లాడుతూ దేశంలో 73 శాంతి మంది ప్రొటీన్‌ లోపంతో బాధపడుతున్నారని జనాభాలో 17 శాతం మంది తక్కువ బరువు, వాటివల్ల కలిగే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రతిరోజూ ఒక కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాలని సిఫారసు చేసిందని ఒక గుడ్డు సగటున 6 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుందని అన్నారు. గుడ్డులో అత్యంత విశేషమైన పోషకాలు లభ్యమవుతాయని అందువల్ల ప్రతి ఒక్కరు రోజు ఒక గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News