Monday, October 27, 2025
ePaper
Homeఅంతర్జాతీయంపలు దేశాల్లో భూకంపం

పలు దేశాల్లో భూకంపం

నాలుగు దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనలతో ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు. తుర్కియేలో నిన్న (మంగళవారం) పొద్దున భారీ భూకంపం వచ్చింది. మర్మారి సమీపంలోని మధ్యధరా సముద్రంలో బుధవారం ఉదయం 2:17 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదైంది.

ఈ భూకంప ప్రభావం వల్ల గ్రీక్ దీవి సహా పలు ప్రాంతాల్లోనూ భూకంపం చోటుచేసుకుంది. పలు సిటీలు, టౌన్లు భూప్రకంపనలకు లోనయ్యాయి. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. భూకంపం భారీగా వచ్చినప్పటికీ పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ తెలిపింది. తుర్కియేలో రెండేళ్ల కిందట 7.8 తీవ్రతతో భూమి కంపించటంతో 50 వేల మందికి పైగా చనిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News