Wednesday, March 18, 2026
Homeఆరోగ్యంEarly Dinner Benefits | రాత్రిపూట ఆహార సమయాన్ని మార్చుకోండి..

Early Dinner Benefits | రాత్రిపూట ఆహార సమయాన్ని మార్చుకోండి..

  • లేట్ నైట్ ఫుడ్ చాలా అపాయం..

రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ప్రస్తుతం చాలా సాధారణ సమస్యలుగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం, 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30-79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సుమారు 1.4 బిలియన్ మంది హైపర్‌టెన్షన్ తో బాధపడుతున్నార‌ని వెల్ల‌డైంది. అలాగే 2022లో దాదాపు 830 మిలియన్ మంది డ‌యాబెటిస్ తో జీవిస్తున్నార‌ని తేలింది. కాబట్టి ఈ రెండు సమస్యలను నియంత్రించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇటీవల చేప‌ట్టిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం, నిద్రకు కనీసం మూడు గంటల ముందు తినడం ఆపితే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉంది.

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుని మరమ్మత్తు పనులు చేయాలి. కానీ తినడం వల్ల జీర్ణక్రియ కొనసాగుతుంది. దీంతో రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర నియంత్రణ తగ్గడం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు నిద్రపోతే, సాయంత్రం 7 గంటలలోపే భోజ‌నాన్ని తీసుకోవ‌డం పూర్తి చేయాలి. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. ప‌ప్పు, పనీర్ కూర, గ్రిల్ చేసిన చికెన్, సలాడ్ వంటి ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రకు మూడు గంటల ముందు నుండే లైట్ల వెలుతురు తగ్గించాలి. మొబైల్, స్క్రీన్ ఉపయోగం తగ్గించాలి. గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ వంటి వాటిని తాగ‌డం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News