అబ్దుల్లాపూర్ మెట్ బీసీ కాలనీలో ప్రభుత్వ పశు ఆసుపత్రి సమీపంలో నూతన డ్వాక్రా మహిళా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ఉపాధ్యాయులతో కలిసి సందర్శించి వివిధ సమస్యలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి సుష్మ, పాలకవర్గ సభ్యులు మొగుళ్ల జీవన్ రెడ్డి, మాచగోని మహేందర్, తాటిపల్లి రమేష్, గడ్డమీది దశరథ, రఘు యాదవ్, తొర్పునూరి శివ గౌడ్, దీపిక నాగరాజు, ఉపేందర్, మాజి ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -
