- సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం..
అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బండ రావిరాల గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘం భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎం.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. నిధుల క్రింద బండ రావిరాల గ్రామానికి మంజూరు చేసిన 10 లక్షల రూపాయలతో సర్పంచ్ కంది కంటి విజయ్ కుమార్ అద్యక్షతన జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ యు. శ్రీవాణి ముగ్గు పోసి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీసీ సరస్వతి, వీవో అధ్యక్షురాలు బంగారి సుమలత, కార్యదర్శి బంగారి లత, వీ ఓ ఏ లు నోముల వరమ్మ, గోద మాదవి, అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి కే. లావణ్య, కోశాధికారి బీ. లావణ్య, కంది కంటి వరలక్ష్మి, ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డ్ సభ్యులు కన్నె భరత్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవాని శివ, కందికంటి నర్సింగ్ రావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయ్ భాస్కర్, కారోబార్ ఏర్పుల శ్రీశైలం, బీ.ఆర్.ఎస్. పార్టీ గ్రామశాఖ అద్యక్షులు గుండ్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
