Saturday, February 28, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBio-Pesticides Scam | బయోమాటున పెస్టిసైడ్స్‌ దందా

Bio-Pesticides Scam | బయోమాటున పెస్టిసైడ్స్‌ దందా

  • దుండిగల్‌ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న నకిలీ బయో కంపెనీలు…
  • మైక్రో న్యూట్రింట్స్‌,బయో స్టిములెంట్‌,. ఆర్గానిక్‌ పేర్లతో అనుమతులు…
  • బయో,ఆర్గానిక్‌ పేర్లతో పెస్టిసైడ్స్‌ నింపి బహిరంగ మార్కెట్‌లో అమ్ముతున్న వైనం…
  • లీగల్‌ మెట్రాలజీ అనుమతులు నిల్‌…
  • ఒక్కో కంపెనీకి ఒక్కో రేటు కట్టి డబ్బులు దండుకుంటున్న దుండిగల్‌ అగ్రికల్చర్‌ అధికారి…

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి సబ్సిడీల పైన ఎరువులు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను అందజేస్తు రైతులకు అండగా నిలుస్తున్నాయి.కానీ కొందరు వ్యవసాయ శాఖ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆకాంక్షలను నీరు కారుస్తూ మోకాళ్ళ అడ్డుతున్నారు. అన్నం పెట్టే రైతులకు అండగా నిలవాల్సిన అధికారులే రైతులను నిండా ముంచే కంపెనీలు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడి తమ ఉద్యోగ ధర్మాన్ని మరచి ప్రభుత్వా నిబంధనలకు వ్యతిరేకంగా బయో,ఆర్గానిక్‌ మాటున పెస్టిసైడ్స్‌ తయారు చేస్తున్న కంపెనీలకు అండగా నిలుస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌ గండి మైసమ్మ,బోరంపేట్‌,సూరారం, సుభాష్‌ నగర్‌,దూలపల్లి, జీడిమెట్ల,గాంధీ నగర్‌ పారిశ్రామిక వాడల్లో మైక్రో న్యూట్రిన్స్‌,బయో స్టిములెంట్‌, ఆర్గానిక్‌ తయారు కంపెనీ పేర్లతో అనుమతులు పొంది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పెస్టిసైడ్స్‌ తయారు చేసే కంపెనీలు విచ్చలవిడిగా వెళుతున్నాయి. యుమిక్‌ ఆసిడ్‌,అమినో ఆసిడ్‌,ఫుల్విక్‌ ఆసిడ్‌, సీవీడ్‌ ఎక్సట్రాక్టు వంటి మెటీరియల్‌ తో తయారు చేయాల్సిన బయో ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ ను తయారు చేయాలి. కానీ ఇమామేతిన్‌,డెల్టా మెత్రిన్‌, అభ మేక్టిన్‌,డిఎంఎఫ్‌ వంటి కెమికల్స్‌ తో పెస్టిసైడ్స్‌ తయారుచేసి బయో,ఆర్గానిక్‌ అంటూ బహిరంగ మార్కెట్లో అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

- Advertisement -

లీగల్‌ మెట్రాలజీ అనుమతులు నిల్‌

లీగల్‌ మెట్రాలజీ నుండి కనీస అనుమతులు పొందకుండానే క్రయవిక్రయాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి దండి కొడుతున్నారు.రంగురంగుల బ్రోచర్లతో ఇన్స్టెంట్‌ గ్రోతింగ్‌, ఫ్లవరి అంటూ ఆకర్షణీయమైన లేబుల్స్‌ ఏర్పాటు చేసి బహిరంగ మార్కెట్లలో అమ్మకాలు చేస్తుండడం తో వాటిని వాడి పంట దిగుమతి తగ్గి అనేక మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెస్టిసైడ్స్‌ తయారు చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా ప్రవేట్‌ ట్రాన్స్పోర్ట్‌ ల ద్వారా ఇతర జిల్లాలు,రాష్ట్రాలకు సైతం తరలిస్తున్న బయో మాటను పెసైడ్‌ కంపెనీల ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో సైతం లీగల్‌ మెట్రాలజీ అధికారులు జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పలు కంపెనీలపై దాడులు నిర్వహించి కేసులు సైతం నమోదు చేశారు. రైతులను నిండా ముంచుతున్న ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పలువురు పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు.

లక్షల్లో వసూలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు చిన్న పెద్ద కంపెనీలు అంటూ తేడా లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కో కంపెనీకి ఒక్కో రేటు కట్టి ప్రతి కంపెనీ వద్ద ముక్కు పిండి మరి 50 వేల నుండి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు కంపెనీ నిర్వాహకులు వ్యవసాయ శాఖ అధికారి పేరు వింటేనే హడలిపోతున్నారు.కొత్తగా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం దరఖాస్తు చేసుకునే వారికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ నిబంధనలతో పనిలేదు వ్యవసాయ శాఖ అధికారులు అడిగింది ఇస్తే అనుమతులు ఇట్టే వచ్చేస్తున్నాయి. రైతు ప్రభుత్వం గా చెప్పుకునే ప్రజాపాలన ప్రభుత్వం వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, వ్యవసాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్న అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

దుండిగల్‌ మండల పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారి బయో కంపెనీల వద్ద సంవత్సరం మామూలు, యూనియన్‌ డైరీ పేరుతో ప్రతి సంవత్సరం వసూలు చేస్తుంది ఎంత? ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఆయన చేస్తున్న అవినీతి ఏంటి? అనేది మరో కథనం ద్వారా ఆదాబ్‌ మీ ముందుకు తేనుంది….మా అక్షరం అవినీతిపై హస్త్రం….

- Advertisement -
RELATED ARTICLES

Latest News