Friday, February 27, 2026
Homeవరంగల్‌Calendar | డిటిఎఫ్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ.

Calendar | డిటిఎఫ్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పర్వతగిరి పాఠశాల ఆవరణలో డిటిఎఫ్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ మండల విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఏనుగల్లు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ గాయపులింగారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం, మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదని అన్నారు. అందరూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడే విధంగా చూడాలని, ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేసి మంచి పేరును విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిటిఫ్ జిల్లా కౌన్సిలర్ గాయపు లింగారెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, సమగ్ర సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు తక్షణమే రేమినరేషన్ చెల్లించాలని, ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డి.టి.ఎఫ్ మండల అధ్యక్షులు మహంకాళి రామస్వామి, ప్రధాన కార్యదర్శి బొలుగోడ్డు శ్రీధర్, జడ్పీహెచ్ఎస్ పర్వతగిరి ఇన్చార్జి హెడ్మాస్టర్ పాక రమేష్ బాబు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ వెంకటరమణారెడ్డి, నరసింహారావు, గాదె ఎల్లరాజు, పోశాల చంద్రశేఖర్, కల్లూరు సుభాషిని, లలితా దేవి, నవీన్ కుమార్, మడతభాస్కర్, అనిల్ కుమార్, వెంకన్న, పరుశరాములు, మౌనిక, శ్వేత, తిరుమల, రాధాకృష్ణ మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News