- మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు
- 10 వేల రూపాయలు లేదా ఆరు నెలలు జైలు శిక్ష
- వాహనదారులు మద్యం సేవించి బండి నడపరాదు
- పై నిబంధనలు పాటించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి
- జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక వారి జీవితం కటకటాల పాలు కావడం తప్పదని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి పట్టుబడితే 10 వేళ రూపాయల జరిమానా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందనీ మద్యం సేవించి రెండవసారి వాహనం నడుపుతూ పట్టుపడితే 15 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందనీ జరిమానా డబ్బులు కట్టని వారికి, జైలు శిక్ష విధించడం జరుగుతుందనీ ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదనీ అన్నారు.
వాహనదారులకు మరియు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు, మరియు మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు, తల్లి తండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని మరియు సైలెన్సర్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు .వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి.పై నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
