నూతన సంవత్సర తనిఖీల(New Year Checks) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) అంతటా మద్యం తాగి వాహనం(Drunk and Drive) నడిపినందుకు 2791 మందిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో గరిష్ట కేసులు నమోదయ్యాయి. తర్వాత.. సైబరాబాద్(Cyberabad), రాచకొండ (Rachakonda) ఉన్నాయి. హైదరాబాద్‌లో 1198 కేసులు, సైబరాబాద్‌లో 928 కేసులు, రాచకొండలో 605 కేసులు బుక్ అయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపడాన్ని అరికట్టడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, పండుగ సమయంలో ప్రజల భద్రత కోసం ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్(Enforcement Drive) నిర్వహించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడాన్ని కట్టడి చేసేందుకు, రోడ్లపై బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి.. నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చర్యలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.
Drunk Driving | 2791 మందిపై కేసులు
- Advertisement -
RELATED ARTICLES
