Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణసింగర్ మంగ్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో డ్రగ్స్ వాడకం

సింగర్ మంగ్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో డ్రగ్స్ వాడకం

కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు

ప్రముఖ గాయని మంగ్లీకి చేవెళ్ల పోలీసులు షాక్ ఇచ్చారు. మంగ్లీ బర్త్ డే వేడుకలో మాదకద్రవ్యాలు(డ్రగ్స్) వినియోగించినందుకు ఆమెతోపాటు ఆ పార్టీకి హాజరైన పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ పుట్టిన రోజు సంబరాలు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్‌లో జరిగాయి. ఆమె పార్టీ ఇచ్చిన ఈ రిసార్ట్స్‌పై పోలీసులు రైడ్ చేసి భారీఎత్తున గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నవారికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పలువురికి గంజాయి పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News