హైదరాబాద్: మంగళవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.42 లక్షల విలువైన 10.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం. అర్జున్ (18), వి. శ్రీనివాస్ (20)గా పోలీసులు గుర్తించారు. వీరు ఒడిశాలోని బెర్హంపూర్‌లో గంజాయిని కొనుగోలు చేసి, రైలులో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటిఎస్ ఎక్కి కాచిగూడ చేరుకున్నారు. అక్కడ యాంటీ-డ్రగ్ తనిఖీల్లో పట్టుబడ్డారు.
పట్టుబడిన గంజాయిలో కొంత భాగాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో అమ్మి, మిగిలినది స్నేహితులకు ఇద్దామని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు యువకులు డ్రగ్స్ కి, మద్యానికి బానిస అయ్యి నేరాలకు అలవాటు పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన అర్జున్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వార్తలు :