రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కేరళ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల(Sabarimala)కు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి కోసం అధికారులు నిబంధనలను సడలించారు. వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లుచేశారు. అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయ్యప్ప స్వామి(Ayyappa Swami)ని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్‌లో ప్రయాణించారు. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం హెలిప్యాడ్ కాంక్రీట్‌లో కూరుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను సరిచేశారు.
