Sunday, March 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | ఎన్నో ఏళ్ల కల.. నెరవేరిన వేళ..

Aadab Effect | ఎన్నో ఏళ్ల కల.. నెరవేరిన వేళ..

  • ఎట్టకేలకు పాలకవీడు మండలానికి డాక్టర్ నియామకం
  • ఆదాబ్ వరుస కథనాలతో స్పందించిన జిల్లా కలెక్టర్..
  • హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు

ఆదాబ్ కథనా నికి స్పందన లభించింది. ఈనెల 7న ఆదాబ్ దినపత్రికలో ప్రచు రిత మైన వైద్యుడు లేక అవస్థలు.. వైద్యం కోసం పరుగులు.. అనే వార్త కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణను పాలకవీడు వైద్యున్ని నియమించమని ఆదేశించారు. ఎట్టకేలకు పాలక వీడుకు వైద్యాధికారిణి కేటాయించారు. బుధవారం పాలకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సౌమ్యశ్రీ నూతన బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటివరకు వైద్య సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలకవీడు మండల ప్రజలకు ఈ డాక్టర్ నియా మకం ద్వారా తక్షణ చికిత్స లభిస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం తగ్గుతుందని, ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయానికి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆదాబ్ దినపత్రికకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News