హార్వెస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్, డైరెక్టర్ కె ఇమ్మానుయేల్ టీం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సాలంక గ్రామంలో గత నెల 25న దాదాపు 40 ఇండ్లు దగ్దమైన విషయం తెలిసిందే. ఆ కుటుంబాలు అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలుసుకున్న, గుంటూరు జిల్లాకు చెందిన హార్వెస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్, డైరెక్టర్ కె ఇమ్మానుయేల్ టీం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల ఇండ్లను సందర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి, బాధిత కుటుంబాలకు రగ్గులు, లుంగీలు, టవల్స్ పేస్టులు, సబ్బులు అలాగే చిన్న పిల్లలకు బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేసి, బాధిత కుటుంబాలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ మాట్లాడుతూ కోయ జాతి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకుని తోచిన విధంగా సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.



