Friday, March 6, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandra Babu | 3 లక్షల ఇళ్లు పంపిణీ

CM Chandra Babu | 3 లక్షల ఇళ్లు పంపిణీ

దేవగుడిపల్లిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ (Distribution Of Houses) కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandra Babu) పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకు కేటాయించారు. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకేసారి లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్‌(Virtual)గా ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు (House Locks) అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana)-బీఎల్సీ (BLC) కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ (PMAY Gramin) కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ (PMAY Janman) పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేశారు. మొత్తంగా 3,00,192 ఇళ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గృహ ప్రవేశాలు జరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.

- Advertisement -

పేదలకు గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత

2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం నిలిపేసిన ఇళ్ల నిర్మాణ బకాయిల బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా.. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవంలో జిల్లాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News