Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

  • డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో కార్యాల‌యానికి..
  • ఇటీవ‌లే దిల్‌రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు దిల్‌ రాజు. డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో ఐటీ కార్యాలయానికి నిర్మాత విచారణకు వచ్చారు. వారం క్రితం దిల్‌ రాజు ఇంటితో పాటు అతని కార్యాలయం, వారి కుటుంబసభ్యుల నివాసాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు వివరాలు, ఐదు సంవత్సరాల పాటు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలతో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఐటీ. ఈ నేపథ్యంలో కొన్ని పత్రాలతో పాటు ఆదాయపు చెల్లింపులపై పూర్తి స్థాయి పత్రాలతో దిల్‌రాజు విచారణకు హాజరయ్యారు. 2023 నుంచి 2025 వరకు సినీ నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులు, వచ్చిన ఆదాయాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకురావాలంటూ ఐటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐటీకార్యాలయానికి వచ్చిన దిల్‌రాజు విచారణను ఎదుర్కుంటున్నారు. మరో రెండు గంటల్లో విచారణ ముగియనుంది. ఐటీ విచారణ ముగిసిన తర్వాత దిల్‌ రాజు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News