- ఓయూ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్
- కాలానుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలి: ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసిం
- ఓయూ ఆర్ట్స్ కళాశాలలో లైబ్రరీ సైన్స్ రెండు రోజుల సెమినార్ ప్రారంభం
నేటి సమాజంలో ఆన్‌లైన్–డిజిటల్ విద్య ప్రతి ఒక్కరికీ అవసరమని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ అన్నారు.ఓయూ ఆర్ట్స్ కళాశాలలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కోహా” (ఓపెన్ సోర్స్ ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ మేనేజ్‌మెంట్ సిస్టం) రెండు రోజుల సెమినార్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
డిజిటల్ ఉపకరణాలు,మొబైల్ ఫోన్లను ఓపికతో,అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకుంటే సరైన,విలువైన సమాచారాన్ని పొందవచ్చని వీసీ తెలిపారు.యూనివర్సిటీలో నాణ్యమైన బోధనతో పాటు ప్రపంచస్థాయి జర్నల్స్‌లో పరిశోధన పత్రాలను ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు.రీసెర్చ్ ఆర్టికల్స్‌కు వచ్చే సైటేషన్స్ యూనివర్సిటీకి,పరిశోధకులకు గుర్తింపు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
హెచ్ ఇండెక్స్,జి.ఇండెక్స్ తదితర సూచికలు పరిశోధనల నాణ్యతను తెలియజేస్తాయని వివరించారు.అదేవిధంగా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కాసిం మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా విధానాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అరచేతిలోని మొబైల్ ద్వారా అనేక అంశాలను నేర్చుకోవచ్చని అన్నారు. కళాశాలలో తరగతులతో పాటు సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తూ విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్. లక్ష్మణరావు, కార్యశాల కన్వీనర్ డాక్టర్ జె. వివేకవర్ధన్, రిసోర్స్ పర్సన్ డాక్టర్ శేషయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లక్‌పతి,అధ్యాపకులు,రీసెర్చ్ స్కాలర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.
