- పాలమూరు నుండి వలస వచ్చిన ధర్పల్లి బీసీల ద్రోహి..
- పార్టీలు వేరైనా సుధీర్ రెడ్డి ధర్పల్లి ఒక తాను బిడ్డలే..
- లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ శ్రీనివాసులును రాజకీయంగా ఎదగకుండా చేసిన ద్రోహి ధర్పల్లి..
- సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత ఆకుల రమేష్ గౌడ్ పేరును బైరామల్ గూడ ఫ్లై ఓవర్ కు పెట్టాలి..
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్..
ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని అవిభాజ్య కర్మన్ ఘట్ డివిజన్ నుండి లింగోజిగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టి ఆఫిసియల్ స్పోక్స్ పర్సన్ బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. లింగోజిగూడ డివిజన్ కు జరిగిన కార్పొరేటర్ ఎన్నికలలో మాజీ కౌన్సిలర్, ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్ దివంగత ఆకుల రమేష్ గౌడ్ కార్పొరేటర్ గా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే కరోనా సమయంలో ఆరోగ్యం సహకరించక అకాల మరణం చెందారు. ఆయన మరణంతో డివిజన్ ఖాళీ అయింది. ఆయన దశదినకర్మ రోజున ఈ డివిజన్ కు ఉప ఎన్నిక గనుక వస్తే ఇక్కడ ఎవరిని పోటీలో పెట్టొద్దు.. వారి కుటుంబo నుండి ఒకరికి అవకాశం ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకుందాము అని, అందులో నేనే మొదటి సంతకం చేస్తాను అని ధర్పల్లి అన్నారు.
కానీ మాట మార్చి వక్రబుద్ధితో నాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటానని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కుమ్మక్కై ఇక్కడ మీరు అభ్యర్థిని పెట్టొద్దు నాకు ఎన్నికలలో సహకరించాలి అని సుధీర్ రెడ్డిని, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి వేడుకున్నాడు. సుధీర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడి లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికలలో అభ్యర్థిని పెట్టకుండానే ధర్పల్లి రాజశేఖర్ రెడ్డికి బయటనుండి మద్దతు ఇచ్చి ఆయన గెలుపులో భాగస్వామ్యం అయ్యారు.
సీనియర్ నాయకులు దివంగత ఆకుల రమేష్ గౌడ్ కుమారుడు ఆకుల అఖిల్ గౌడ్ బిజెపి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడితే అది చూసి ఓర్వలేని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా ఓడగొట్టాలని.. సుధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు చేతులు కలిపి అఖిల్ గౌడ్ ను ఓడగొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఏకైక కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బీసి బిడ్డ మధు యాష్కిగౌడ్ ను కూడా దగ్గరుండి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఓడ కొట్టాడు అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీసీలు అంటే గిట్టదు.. బీసీ నాయకత్వము బలపడుతుంటే ఓర్చుకోలేడు. అందుకనే కావాలని బైరామల్ గూడ ఫ్లైఓవర్ కు ఆకుల రమేష్ గౌడ్ పేరు పెడితే బీసీలు రాజకీయంగా ఏకమవుతారు.. సంఘటితమవుతారని దివంగత వంగ మధుసూదన్ రెడ్డి పేరు పెట్టాలని జిహెచ్ఎంసిలో లెటర్ పెట్టాడు.. ఇతని పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అయినప్పటికీ కులం, ఆస్తిత్వం కాపాడటం కోసం ఇంత దిగజారుతావా అని వెంకటేష్ గౌడ్ దుయ్యబాట్టారు. ఇది నీ రాజకీయ జీవిత సమాధికి పరాకాష్ట అని హెచ్చరించారు..
