Wednesday, October 29, 2025
ePaper
Homeబిజినెస్‘దేవి’ లాంఛనంగా ప్రారంభం

‘దేవి’ లాంఛనంగా ప్రారంభం

మహిళా వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తల కోసం

మహిళల మార్గదర్శక సమూహమైన దేవి(Dewi).. తమ లోగోను లాంఛనంగా ఆవిష్కరించింది. Dewiకి ఫుల్‌ఫామ్.. డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్. లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ (జూన్ 10 మంగళవారం) జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడిలో నిర్వహించారు. డాక్టర్ నీలిమ వేముల స్థాపించిన ఈ సంస్థ.. ఎపెక్స్ చైర్‌పర్సన్ సత్యవతి ప్రసన్న మదిపడిగె(MMN-మీటింగ్ మిలియన్స్ నెట్‌వర్క్) మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుంది. డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల (వైస్ చైర్‌పర్సన్), డాక్టర్ సౌమ్య కొల్లి.. సహ వ్యవస్థాపకులు. వివిధ వృత్తులు, వ్యాపార నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలు కనెక్ట్ అవ్వడానికి, సహకరించడానికి, వృద్ధి చెందడానికి బలమైన వేదికను సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యం.

“దేవి అనేది కేవలం ఒక సమూహం కాదు. ప్రతి రంగం నుంచి వచ్చిన మహిళలను ప్రోత్సహించడానికి, వారి ఉన్నతికి, ఏకం చేయడానికి ఉద్దేశించిన ఒక ఉద్యమం” అని వ్యవస్థాపక చైర్‌పర్సన్ డాక్టర్ నీలిమ వేముల చెప్పారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ నాయకులు, వైద్యులు, న్యాయ నిపుణులు, ఆర్థిక సలహాదారులు, నగల వ్యాపారులు, బొటిక్ యజమానులు, ఫుడ్‌ప్రెన్యూర్స్, కళాకారులు, చేనేత కార్మికులు తదితర విస్తృత శ్రేణి వృత్తుల నుంచి వచ్చిన మహిళలందరికీ దేవి సభ్యత్వం అందుబాటులో ఉంది. ఇది.. కలుపుగోలుతనం, సాధికారత, భాగస్వామ్య వృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది.

dewi launched at peddamma temple

‘దేవి’ని ప్రారంభోత్సవం అధికారికంగా ఈ నెల జూన్ 27న తొలి 108 మంది సభ్యుల ప్రత్యేక సమావేశంతో జరుగుతుంది. సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరవుతారు. ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఆసక్తిగల మహిళలు అధికారిక గూగుల్ ఫారం ద్వారా లేదా ఈ కింది నంబర్ల ద్వారా నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ నంబర్లు.. +91 98856 57619, 939-339-3633.

RELATED ARTICLES
- Advertisment -

Latest News