Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Secunderabad | సికింద్రాబాద్‌లో అభివృద్ధే మా అజెండా పద్మారావు గౌడ్

Secunderabad | సికింద్రాబాద్‌లో అభివృద్ధే మా అజెండా పద్మారావు గౌడ్

  • మెట్టుగూడ డివిజన్‌లో రూ.86 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సికింద్రాబాద్ నియోజకవర్గంలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించిన ఘనత తమదేనని,ప్రజలు నిరంతరం తమకు బ్రహ్మరథం పడుతున్నారని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు.బుధవారం మెట్టుగూడ డివిజన్‌లో ఆయన విస్తృతంగా పర్యటించి రూ.86 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.చింతాబావి,దాదర్ కాంపౌండ్,మెట్టుగూడ,మైలారగడ్డ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,పార్టీ నేతలు,శ్రేణుల సహకారంతో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నామని తెలిపారు.ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని చెప్పారు.ప్రజలు తమ అవసరాల కోసం సీతాఫలమండీలోని తన కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత మాట్లాడుతూ,ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారంతో మెట్టుగూడ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ,అధికారులు సరిత, హేమూ నాయక్,యువనేత రామేశ్వర గౌడ్,అధికారులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News