అందరూ నవీన్ యాదవ్‌కే ఓటేయండి
జూబ్లీహిల్స్ ప్రజలకు జగ్గారెడ్డి విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో అందరూ కాంగ్రెస్ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్(Naveen Yadav)కే ఓటేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) కోరారు. కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు అధికారంలో ఉంటుందని, జూబ్లీహిల్స్ డెవలప్‌మెంట్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు కావాలో అన్నీ సీఎం రేవంత్(CM Revanth)తో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ యువకుడు, బస్తీల్లో పెరిగిన నాయకుడు, విద్యావంతుడు, శక్తి, యుక్తి రెండూ ఉన్నాయి. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం గలవాడు. కాబట్టి అన్ని విధాలా అతనే అర్హుడని తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే రాబోయే మూడేళ్లు మీకు సేవ చేస్తాడు. సీఎం ద్వారా మీకు కావలసిన అభివృద్ధి చేస్తాడు. మిగతా అభ్యర్థుల కన్నా నవీన్ యాదవ్ సమర్థుడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రజల పక్షాన మీ పనులు చేస్తాడు. అపోజిషన్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లలేడు. అభివృద్ధి చేయలేడు. ప్రశాంతంగా ఆలోచించి ఓటేయండి. మంత్రులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. అందరి సమస్యలు వింటున్నారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ వద్ద ప్రభుత్వ చౌక ధాన్యపు డిపోలను ఏర్పాటు చేశారు. ఇదంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితమే.
అంతకుముందు BRS MLA ఉన్నా సమస్యను పరిష్కరించలేకపోయారు. ఇదే నిదర్శనం… అధికార పార్టీకి ఓటేస్తే ఎంత లాభం ఉంటుందో అనేదానికి. అందుకే నవీన్ యాదవ్ ను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మేమంతా జవాబుదారిగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాం. బోరబండలో అత్యధిక మెజారిటీతో గెల్పించండి… నా నంబర్ మీకు ఇస్తా.. మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. 40 వేల ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ నవీన్ యాదవ్ కి వేసి గెలిపిస్తే మీకు 6301444193 నంబర్ అందుబాటులో ఉంటుంది. జూబ్లీహిల్స్ కి ఎన్ని కోట్లు కావాలో నేను ముఖ్యమంత్రి తో మాట్లాడి అభివృద్ధి చేస్తా.
నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి చేస్తాడు. అపోజిషన్ గెలిస్తే ధర్నాలు, రాస్తారోకోలకి పరిమితం అవుతారు. దానివల్ల ఉపయోగం లేదు. అన్ని వర్గాల వాళ్ళు దయచేసి ఆలోచించండి… నవీన్ యాదవ్ ను గెలిపించండి. కేసీఆర్ ఫ్యామిలీ సోషల్ మీడియా రూములో పండుతున్నట్టుంది… ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు… యూత్ ఆలోచించండి… వాటిని చూసి ఎంజాయ్ చేయండి తప్ప. వాటిని ఆచరించకండి. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ గురించి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు… త్వరలోనే అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… అందుకు తగ్గట్టు బడ్జెట్ సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు..
నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ లపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడు… వాళ్ళని దగ్గరగా పరిశీలిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థం అవుతుంది.. కెటిఆర్ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు… అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు… హైడ్రాను బూచిగా చూపిట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క ఇల్లు కూల్చలేదు. బాధ్యత లేని సోషల్ మీడియాను నమ్మి మోసపోకండి..
