Wednesday, February 11, 2026
Homeఖమ్మంBhatti | ‘యంగ్ ఇండియా స్కూల్’కి శంకుస్థాపన

Bhatti | ‘యంగ్ ఇండియా స్కూల్’కి శంకుస్థాపన

వైరా(Wyra) నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా (Young India) ఇంటిగ్రేటెడ్ (Integrated) రెసిడెన్షియల్ స్కూల్‌(Residential School)కి డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) శంకుస్థాపన చేశారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమన్న నమ్మకంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల(Internationa Standards)తో అభివృద్ధి (Development) చేస్తోందని చెప్పారు. వైరాలో నిర్మిస్తున్న ఈ స్కూల్ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా, ఒక గేమ్‌చేంజర్‌లా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

- Advertisement -

ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో వైరాలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నాం. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, క్రీడా కార్యక్రమాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. స్కూల్ నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో ఇప్పటికే రూ.30 కోట్లు జమ చేశాం.

పనులు వేగంగా సాగేందుకు ప్రతి 15 రోజులకు నిధులు విడుదల చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డైట్ చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకునే విధానాన్ని అమలుచేస్తున్నాం. విద్యతోనే సమాజం ఎదుగుతుంది.
విద్యార్థుల భవిష్యత్తు బలపడే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News