Tuesday, February 10, 2026
HomeసినిమాBhatti | ‘అన్నపూర్ణ’ సందర్శన

Bhatti | ‘అన్నపూర్ణ’ సందర్శన

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఆహ్వానం మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నపూర్ణ (Annapurna) ఫిల్మ్ స్కూల్ (Film School), స్టూడియో(Studio)ను సందర్శించారు. ఈ సందర్భంగా సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన ANR క్రమశిక్షణ, కృషి, విలువలు నేటి తరానికి ప్రేరణగా ఉంటాయని చెప్పారు.

అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వసతులను పరిశీలిస్తే ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. మన తెలంగాణ యువతకు సినిమా, మీడియా, డిజిటల్, క్రియేటివ్ రంగాల్లో మరింత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News