Thursday, March 26, 2026
Homeఖమ్మంReview Meeting | ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం

Review Meeting | ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం

డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu BhattiVikramarka) బుధవారం ఖమ్మం జిల్లా(Khammam District) కలెక్టర్ కార్యాలయం(Collectorate)లో విద్యా(Education), సంక్షేమ(Welfare) రంగాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం నిజమైన, అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రగతిని దృష్టిలో ఉంచి అధికారులకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పారు. ప్రజల పన్నులతోనే ప్రభుత్వ వ్యవస్థ నడుస్తోంది కాబట్టి మనందరం ప్రజలకు జవాబుదారులమనే భావనతో పనిచేయాలని తెలిపారు.

‘2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో మానవ సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యా రంగంలో విస్తృత పెట్టుబడులు పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, ప్రభుత్వ, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సంక్షేమ పథకాల పెండింగ్ బిల్లులను వేగంగా విడుదల చేస్తున్నాం. పథకాల అమలు విషయంలో ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- Advertisement -

గిరిజన రైతుల అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద ఉచిత సోలార్ విద్యుత్తు, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలను అందిస్తున్నాం. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల పెంపే మన ప్రభుత్వ ధ్యేయం. ప్రజా సంక్షేమమే ప్రతి నిర్ణయానికి కేంద్ర బిందువు’ అని భట్టివిక్రమార్క దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News