Sunday, March 1, 2026
Homeవరంగల్‌BC Protection | తెలంగాణలో బీసీలపై దాడులు.

BC Protection | తెలంగాణలో బీసీలపై దాడులు.

  • శాసనసభ సమావేశాలలో బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి.
  • బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై, బడుగు బలహీన వర్గాలపై అగ్ర కుల అహంకారుల ఆగడాలు అంతు లేకుండా పెరిగి పోతున్నందున వెంటనే బీ.సీ రక్షణ చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలలో సమాజం ఎంతో పురోగ మిస్తున్నప్పటికీ నేటికీ మూఢనమ్మకాలు, కుల వివక్షత విలయ తాండవమాడుతున్నదన్నారు.

మంత్రాల నెపంతో దౌర్జన్యాలు దాడులు, బీసీలు, కులవృత్తిదారులు సామాజిక న్యాయం కోసం తమ హక్కుల కోసం ప్రశ్నించినచోట కుల బహిష్కరణ పేరుతో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలకు చెందిన దుండగులు బీసీల ఎడల దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు తెలిసిందేనన్నారు.

- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లా ‘కుమ్మెర’ గ్రామంలో మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్ళిన రజక కుటుంబానికి చెందిన వారిపై అగ్రకుల దురహంకారులు అమానుషంగా దాడి చేసి రెండు నెలల పసికందు ప్రాణాల్ని బలిగొన్న దుండగులపై చర్యకు బదులుగా పోలీసులు బాధితులపైనే ముందుగా కేసు నమోదు చేయడం, ప్రజా ఆందోళనల తరువాత కొందరిని అరెస్టు చేశారని, వారిపై హత్యా నేరం కేసులు పెట్టి అత్యంత కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం తోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించా
లన్నారు.

రాష్ట్రంలో బీసీలపై ఇటువంటి దాడులను అరికట్టడానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News