Tuesday, March 17, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | "స్వేచ్ఛ అంటే బాధ్యత.. బలాదూర్తనం కాదు సుమా!"

Aaj Ki Baath | “స్వేచ్ఛ అంటే బాధ్యత.. బలాదూర్తనం కాదు సుమా!”

సమాజం ఎటువైపు పోతుంది? ఏమవుతోంది?ఎలా పోతే మాకేంటి అని గాలికి జాలిగా వదిలేద్దామా!? తల్లిదండ్రులంటే మర్యాద లేదు, ప్రేమ లేదు. గురువులంటే గౌరవం కూడా లేదు. “మాకేంటి?” అనేదే నయా యూత్లో ఒక బూత్ కల్చర్ మారుతోంది! తప్పు చేస్తే అది తప్పని చెప్పిన గురువులు, తల్లిదండ్రులనే కనీస గౌరవం, మర్యాద లేకుండా ఎదురెళ్లి కొట్టడమేనా!? ఇవేనా యూత్ నేర్చుకుంటున్న న్యూ ట్రెండ్ విలువలు?. ఇందుకేనా కన్నవాళ్లు అష్టకష్టాలు పడింది?. మంచి (బుద్ధి) మాట చెప్పడం తప్పేనా! అయితే ఈ యూత్ ఇంతేలే అని వదిలేద్దామా!? స్వేచ్ఛ అనే పేరుతో రెచ్చిపోతూ, విచ్చల విడితనంతో పెద్దలను గౌరవించక పోవడం, చిన్నలను ప్రేమించక పోవడం ఫ్యాషన్గా మారుతోంది. స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా రెచ్చిపోవడం కాదు.దారి తప్పుతున్న సమాజాన్ని గాడిలో పెట్టడం మన అందరి ఉమ్మడి బాధ్యత. “స్వేచ్ఛ అంటే బాధ్యత.. బలాదూర్తనం కాదు సుమా!”

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News