- ఏమిటీ క్రిమినల్ కుట్ర.. రౌడీ భాష..
- జెండానేమో కాంగ్రెస్ ది.. అజెండా మాత్రం టీడీపీది..
- సొంతపార్టీ సీనియర్లను అణచి వేస్తున్నారు..
- డొల్ల వాగ్ధానాలు.. ఆర్ధిక అజ్ఞానం ఇదీ మీ టాలెంట్..
- తెలంగాణ జాతిపిత కేసీఆర్ నా మీరు విమర్శించేది..?
- సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- సీఎం రేవంత్ పై అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేసిన దాసోజు.
రేవంత్ రెడ్డి గారూ.. మీరు తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా? అంటూ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న “లూస్ కానన” అంటే అదుపులేని భాషపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘పాతిపెట్టండి’, ‘బొంద పెట్టండి’, ‘దిమ్మలు కూల్చండి’ వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే, మీరు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు.
ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఒక పక్కా ‘క్రిమినల్ కాన్‌స్పిరసీ’ అంటే నేరపూరిత కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. “అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే” అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని, లోపల తన పాత యజమాని చంద్రబాబు నాయుడి అజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తన ‘ప్లాన్-బి’ లో భాగంగా టీడీపీని మళ్ళీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇది ఒక రకమైన “రాజకీయ వ్యభిచారం” అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరు స్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ, ఇటు టీడీపీతో, అటు బీజేపీతో కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని విమర్శించారు.రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించే తెలివి లేక ‘ఫ్యూచర్ సిటీ’, ‘5 ట్రిలియన్ ఎకానమీ’ అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.ఇక తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో ‘తెలంగాణ జాతిపిత’గా ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. అటువంటి మహనీయుడిని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర#వతీతీ#స్ పార్టీని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికారం శాశ్వతం కాదు, మీ అహంకారమే మీ వినాశనానికి దారితీస్తుంది” అని హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని దాసోజు హితవు పలికారు.
