యూనిట్-1ను వెంటనే మూసేయాలని స్థానికులు, కార్మికుల డిమాండ్
హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మాణిక్‌చంద్ (Manikchand) చౌరస్తా సమీపంలో ఉన్న ఏకశిలా కెమికల్ లిమిటెడ్ (Ekasila Chemical Limited) యూనిట్ వన్‌లో ప్రజలకు హాని కలిగించే కెమికల్స్ తయారుచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కెమికల్స్ వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ తప్పిదాలను ప్రశ్నించినందుకు ఉద్యోగులను తొలగించడంతో శివప్రసాద్, ప్రవీణ్ అనే వ్యక్తులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. ‘మేము తయారు చేసిన ఇల్లీగల్ (Illegal) లిక్విడ్స్ గురించి ఏకశిలా కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ అఫిషియల్ వెబ్ సైట్(Website)లో పొందుపరిచాం. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ (Collector) వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

