Thursday, March 5, 2026
Homeవరంగల్‌దళిత మహిళకు, రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకుల సన్మానం.

దళిత మహిళకు, రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకుల సన్మానం.

  • జన్ను నర్సయ్య, జంగిలి బాబు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో గ్రామ 13వ వార్డు జనరల్ రిజర్వేషన్ కాగా ఈ వార్డు కు దళిత మహిళ చిన్నపెల్లి విజయ పోటీ చేసి ఘన విజయ సాధించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య, అంబేద్కర్ ఫెలోసిఫ్ రాష్ట్ర అవార్డు గ్రహిత జంగిలి బాబు బుధవారం వారి స్వగృహం నందు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించడం జరిగింది.

ఈ సందర్బంగా జన్ను నర్సయ్య మాట్లాడుతూ రానున్న ప్రతి ఎన్నికలలో రిజర్వేషన్ కేటాయించిన సీట్లులో కాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేయవలిసిన అవసరం ఉంది అని తెలిపారు. అంతే కాకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఈ రిజర్వేషన్ హక్కులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. అలాగే ఎప్పుడు గెలిచినా చిన్నపెల్లి విజయ ని ఆదర్శంగా తీసుకొని మహిళలు జనరల్ సీట్లలో పోటీ సుదీర్ఘ పరిపాలన అందించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News