Tuesday, October 28, 2025
ePaper
Homeరంగారెడ్డినవంబర్ 1న దళిత ఆత్మగౌరవ ప్రదర్శనను విజయవంతం చేయండి

నవంబర్ 1న దళిత ఆత్మగౌరవ ప్రదర్శనను విజయవంతం చేయండి

  • మా ఆత్మగౌరవం పై దాడిచేస్తే మేము ఎవరినైనా వ్యతిరేకిస్తాము
  • : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

సుప్రీం కోర్ట్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ 1వ తేదీనాడు హైదరాబాదులో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజిగిరి నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని నేరేడుమెట్టు అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గావాయి పై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు, నాయకులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని,ఇలాంటి రాజకీయాని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసులు అయినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ, జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎందుకు నిరసనలు చేయడం లేదు అని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి సెక్రటేరియట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన ఉంటుందన్నారు.ఈ సందర్భంగా విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నరేంద్ర మోడీ దాడిని వ్యతిరేకించారని,దాడిని రాజ్యాంగంపై దాడిగా పరిగణించారని,మా ఆత్మగౌరవాన్ని,రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిస్తే ఎవరినైనా వ్యతిరేకిస్తాం ఎంతటి ఉద్యమమైన చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా ఇన్చార్జి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, జాతీయ నాయకులు ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పంగ ప్రణయ్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్, వి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్, బచ్చలకూర స్వామి, సలోమి,రాసమల్ల యాదగిరి, బత్తిని శివ, ముత్తిపాక శ్రీనివాస్ సిలివేరు శీను, బండారి సాయి, కోరిపాక అంజి,మందుల శ్రీధర్,బాల నరసింహ,పరశురాం, కృష్ణ , పిఏ సీను,నర్సింగ్ రావు, అరుణ్ ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News