- సరికొత్త కార్యక్రమంతో డాబర్
ఆయుర్వేదాన్ని ఆధునిక జీవనశైలికి మరింత చేరువ చేసేందుకు, ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించే యువ తరానికి మరింత దగ్గరయ్యేందుకు ఒక వ్యూహాత్మక కార్యక్రమంతో ముందుకొచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణ సంస్థ డాబర్ ఇండియా లిమిటెడ్.
ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్యంపై ఆసక్తి పెరుగుతోన్న నేపథ్యంలో.. డాబర్ సంస్థ మూడు ప్రధానమైన అంశాలపై దృష్టి సారించింది. ప్యాకేజింగ్ ను ఆధునీకరించడం, ‘ఆయుర్వేద సంవాద్’ ద్వారా అవగాహన కల్పించడం, ఆరోగ్య శిబిరాల ద్వారా సామాజిక సేవ అనే అంశాలపై దృష్టి పెట్టింది.
ఈ సందర్భంగా డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్-ఎథికల్స్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, “డాబర్ తన మొత్తం ఆయుర్వేద ఔషధాలు, ఎథికల్ ఉత్పత్తులను కొత్త, ఆధునిక ప్యాకేజింగ్‌లో విడుదల చేసింది. కొత్త డిజైన్‌లో బోల్డ్ బ్రాండ్ గుర్తింపు, కనువిందైన రంగుల కలయికతో మెరుగైన చదవగలిగే అక్షరాలతో ఉంటుంది. ఇది బలమైన ఉనికిని, వినియోగదారులతో బలమైన అనుసంధానాన్ని కల్పిస్తుంది. ఈ మార్పు సంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో మేళవిస్తూ, ఆయుర్వేద ప్రామాణికతను కాపాడే డాబర్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

వినియోగదారులకు అవగాహనను పెంచేదిశగా హైదరాబాద్‌లో డాబర్ తన సరికొత్త కార్యక్రమం “ఆయుర్వేద సంవాద్”ను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు, కీలక అభిప్రాయ నాయకులు ఒకే వేదికపైకి వచ్చి.. ఆయుర్వేద పునాదులు, ఆచరణాత్మక అన్వయాలు, ఆధునిక జీవనశైలి సవాళ్లను ఎదుర్కోవడంలో దాని పాత్రపై ‘సంభాష’ అనే పరస్పర చర్చలు జరుపుతారు. రోజువారీ జీవితంలో ఆయుర్వేదాన్ని అందిపుచ్చుకునేందుకు ఆచరణీయ వ్యూహాలను రూపొందించడం, కొత్త పరిశోధనా అవకాశాలను తెరవడం ఈ కార్యక్రమం లక్ష్యం” శ్రీ శివ కుమార్, సేల్స్ హెడ్ – సౌత్ ఇండియా, డాబర్ ఇండియా లిమిటెడ్.
సామాజిక బాధ్యత అనే తన వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆయుర్వేద ఔషధాలు, డయాగ్నస్టిక్ పరీక్షలు, చికిత్స అందించే ఆరోగ్య శిబిరాలను విస్తరించే ప్రణాళికలను కూడా డాబర్ ప్రకటించింది. ఈ చొరవ సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తేవాలనే డాబర్ లక్ష్యాన్ని బలపరుస్తుంది.
“ఆయుర్వేదం కేవలం పురాతన సంప్రదాయం మాత్రమే కాదు“
డాబర్‌లో మాకు అది ఆధునిక శాస్త్రం. ఈ మహోన్నత జ్ఞానానికి మేము కాపలాదారులమే కానీ, దాని ప్రయోజనాలను ఘనమైన ఆధారాలతో నిరూపించే బాధ్యత కూడా మాదే. అందుకే పురాతన గ్రంథాల జ్ఞానాన్ని అత్యాధునిక పరిశోధన, క్లినికల్ ట్రయల్స్, కఠిన నాణ్యతా పరీక్షలతో మేళవిస్తాము. మా ఉత్పత్తులు ‘వారసత్వంతో ధృవీకరించబడినవి, శాస్త్రంతో సమర్థించబడినవి’. సంప్రదాయం-ఆధునిక ఆధారాల మేళవింపే ఈ కలయికే ఆయుర్వేదాన్ని నేటి కొత్త తరానికి నమ్మదగినదిగా, ప్రభావవంతంగా మారుస్తోంది” అని డాక్టర్ ప్రసాద్ అన్నారు.
ప్రాకృతిక, నివారణాత్మక ఆరోగ్య పరిష్కారాలను ఎక్కువగా కోరుకుంటున్న వినియోగదారులకు అనుగుణంగా, డాబర్ బహుముఖ విధానం ఆయుర్వేదం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, నమ్మకమైన ఆధునిక ఆరోగ్య వ్యవస్థగా – నేటి వేగవంతమైన జీవితంలో అవిభాజ్య అంశంగా మారేలా చేస్తోంది.
డాబర్ ఇండియా లిమిటెడ్ గురించి:
భారతదేశంలోని ప్రముఖ FMCG కంపెనీలలో ఒకటైన డాబర్ ఇండియా లిమిటెడ్‌కు నాణ్యత, నమ్మకం అనే 141 సంవత్సరాల వారసత్వం ఉంది. డాబర్ ఉత్పత్తులు ఈ రోజు భారతదేశంలోని 10 ఇళ్లలో 8 చోట్ల చేరుతున్నాయి – ఇది తరతరాలుగా మాపై ఉంచిన విశ్వాసానికి శాశ్వత సాక్ష్యం. మా పోర్ట్‌ఫోలియోలో మూడు రూ.1,000 కోట్ల బ్రాండ్‌లు, మూడు రూ.500 కోట్ల బ్రాండ్‌లు, 16 బ్రాండ్‌లు రూ.100-500 కోట్ల పరిధిలో ఉన్నాయి. డాబర్ ఇండియా FMCG పోరిధిలో తొమ్మిది పవర్ బ్రాండ్‌లు – ఆరోగ్య రంగంలో డాబర్ చ్యవన్‌ప్రాష్, డాబర్ తేనె, డాబూర్ హానిటస్, డాబర్ పుదిన్ హర, డాబర్ లాల్ తైల్; పర్సనల్ కేర్ రంగంలో డాబర్ ఆమ్ల, డాబర్ రెడ్ పేస్ట్, వాటిక; ఆహార-పానీయాల రంగంలో రియల్.
