Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం ఇవాళ (జూన్ 14న శనివారం) సందర్శించింది. ఈ బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు యోగేష్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్‌ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్‌ ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వేలను బృందం పరిశీలించారు.

బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జల వనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను కోరారు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జల వనరుల శాఖ అధికారులు వివరించారు.

ఈ బృందం వెంట పోలవరం ఈఎన్సీ కె.నరసింహమూర్తి, ఈఈలు డి.శ్రీనివాస్, కె.బాలకృష్ణ, డీఈలు అనిల్ కుమార్, శ్రీరాం పటేల్, మల్లికార్జున్, ఏఈఈలు అనిల్ కుమార్, పద్మ కుమార్, సురేష్, అరుణ్, కుమారస్వామి, పోలవరం ప్రాజెక్టు ఎంఈఐఎల్ జీఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి , పాండే, వెంకటేష్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News