Monday, February 23, 2026
Homeరంగారెడ్డిDemolition | జవహర్ నగర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం

Demolition | జవహర్ నగర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం

గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని జవహర్ నగర్ వేరు వేరు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం అందిన వెంటనే కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ తక్షణమే స్పందించారు. అక్రమ నిర్మాణాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలనే ఆదేశాలతో రెవిన్యూ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రమేష్ రంగంలోకి దిగారు.

సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత ప్రాంతాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టారు. వేరు వేరు కాలనీల్లో అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణాలను తొలగించి చట్టపరమైన చర్యలు అమలు చేశారు.

- Advertisement -

అక్రమ నిర్మాణాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా రెవిన్యూ శాఖ పని చేస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News