Wednesday, March 11, 2026
Homeరంగారెడ్డిCPI | కామ్రేడ్ పావనం నరసింహ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు

CPI | కామ్రేడ్ పావనం నరసింహ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు

పావనం నరసింహ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు. వారి భౌతిక కాయానికి సిపిఐ నియోజకవర్గ నాయకుడు తోటపల్లి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నిమ్మల నర్సింలు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి జంగయ్య సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా తోటపల్లి శంకర్ మాట్లాడుతూ పావనం నరసింహ భూపోరాటాల్లో, పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పి నర్సింలు, కురుమయ్య, వి రవి నాయక్, పి లక్ష్మణ్, తోటపల్లి సాయికిరణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News