- సిపిఐ నేతల ఘన నివాళి
జవహర్ నగర్ ప్రాంతంలో బాబుజగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని సిపిఐ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్ష వర్గం సురేందర్ పరుశురాం నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బాబుజగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయాలను కొనసాగించాలని నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్, నిమ్మల నరసింహులు, కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు చిలుముల మల్లేష్, ఏఐటిసి మండల అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు కోదాసు జయమ్మ పాల్గొన్నారు.
- Advertisement -
