Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణCP Sajjanar | లైసెన్సు తుపాకులు సరెండర్ చేయాలి: సీపీ సజ్జనార్

CP Sajjanar | లైసెన్సు తుపాకులు సరెండర్ చేయాలి: సీపీ సజ్జనార్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బై పోల్(BYPOLL) కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌తో పాటు సీపీ సజ్జనార్(CP Sajjanar) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహణకు హైదరాబాద్ పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని నిబంధనలు పాటిస్తున్నామన్నారు.

ఎన్నికల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు , శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందునా జిల్లాలో లైసెన్స్ డు తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల బైండోవర్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News