Tuesday, February 24, 2026
HomeతెలంగాణCP Sajjanar | సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..?

CP Sajjanar | సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..?

సోషల్ మీడియాలో చిన్నారులను అడ్డం పెట్టుకొని ఫేమస్ కోసం తహతహలాడే యూట్యూబర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్(CP Sajjanar) వార్నింగ్ ఇచ్చారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్​ను చేయడం లాంటి చర్యలు పోక్సో, జువైనల్‌ జస్టిస్‌ చట్టాలను ఉల్లంఘించడమేనని సీపీ సజ్జనార్​ ఎక్స్​లో పేర్కొన్నారు.

పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం, వారిని వేధించడం కిందికే వస్తుందని తెలిపారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్​ను చేసే వారి పట్ల పోలీస్‌ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అలాంటి వాటికి సంబంధించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు.

- Advertisement -

తక్షణమే వీటిని తొలగించకున్నా, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసినా చట్టప్రకారం కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని సజ్జనార్‌ యూట్యూబర్లను ప్రశ్నించారు.

వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో సజ్జనార్‌ పోస్ట్‌ పెట్టారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్‌ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.

చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయండి. అంతేకానీ..ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించవద్దు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్టు చేయండి.

స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్‌లైన్‌(helpline) నంబర్‌ 1930కి గానీ..జాతీయ సైబర్‌ కైమ్ర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం మాత్రమే కాదు..వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా మీ బాధ్యతే అనే విషయం మరిచిపోవద్దని సజ్జనార్‌ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో సోషల్​ మీడియా వినియోగం క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది ఎక్కువ వ్యూస్​, లైక్స్​ రావడం కోసం మైనర్లతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అలాంటి వాటివల్ల మైనర్లపై చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్​ యూట్యూబ్(youtube)​ ఛానళ్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అనుచిత వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడమని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News