Monday, February 9, 2026
Homeహైదరాబాద్‌జీహెచ్‌ఎంసీ కమిషనర్,జలమండలి ఎండీని కలిసిన

జీహెచ్‌ఎంసీ కమిషనర్,జలమండలి ఎండీని కలిసిన

  • కార్పొరేటర్ డా. సామల హేమ

డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిశారు.ఈ సందర్భంగా రూ.9.5 కోట్ల అంచనా వ్యయంతో భవానీనగర్–ఫ్రైడే మార్కెట్,ఫ్రైడే మార్కెట్–మొహమ్మద్ గూడ వరకు నాలా అభివృద్ధి పనులు,సీతాఫలమండి శ్మశాన వాటిక అభివృద్ధి,ఎరుకల బస్తీ కమ్యూనిటీ హాల్,నామలగుండులో వార్డు కార్యాలయ భవనం,డీఐఎం బడ్జెట్ కింద రోడ్డు రీకార్పెటింగ్ పనులకు గతంలో ఆమోదం లభించిందని గుర్తు చేశారు.ప్రభుత్వ మార్పు తర్వాత నిలిచిపోయిన ఈ పనులకు నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు.

అనంతరం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌ను కలిసి,డ్రైనేజీ,వాటర్ లైన్లు,మ్యాన్‌హోల్ మెయింటెనెన్స్ పనులకు నిధులు విడుదల చేయాలని, ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ బోర్స్ మరమ్మతులు,అవసరమైన చోట కొత్త పవర్ బోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News