Saturday, October 4, 2025
ePaper
Homeఆరోగ్యందేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు

మన దేశంలో కొవిడ్ కేసులు 7 వేలు దాటాయి. లేటెస్ట్ డేటాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ (జూన్ 11న బుధవారం) వెల్లడించింది. కొత్త కేసులు 306 వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 7,212కి చేరింది. చనిపోయినవారిలో ముగ్గురు కేరళవాసులు. ఇద్దరు కర్ణాటకకు చెందినవారు.

ఒకరు మహారాష్ట్ర వ్యక్తి. మృతుల్లో ఒకరి వయసు 43 ఏళ్లు కాగా అతనిలో ఇమ్యునిటీ పవర్ వీక్ అయినట్లు గుర్తించారు. మిగిలినవారు వయసు మీద పడ్డోళ్లు. శ్వాస సంబంధ, దీర్ఘకాలిక అనారోగ్యం బారినపడినవారే. దేశంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులు పెట్టుకోవాలని, చేతులను నీట్‌గా కడుక్కోవాలని, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని వైద్యులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News