Tuesday, February 10, 2026
Homeజాతీయంట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. ఫ్రెండ్ డొనాల్డ్‌ భాయ్‌ చెబుతున్న మాటలపై మీరెందుకు పెదవి విప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించింది. భారత్-పాక్‌ల మధ్య సమరాన్ని నేనే నిలువరించానంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పటం గత 20 రోజుల్లో ఇది 9వ సారి అని కాంగ్రెస్ గుర్తుచేసింది. 3 దేశాల్లోని 3 నగరాల్లో డొనాల్డ్‌ భాయ్‌ చెప్పిందే చెబుతున్నారు. ‘ఇండియా‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన 4 రోజుల యుద్ధాన్ని అమెరికా ఎలా ఆపిందో ఆయన ప్రపంచానికి వివరించుకుంటూ వెళుతున్నారు. భారత్‌-పాక్‌లు రెండూ తనకు సమానమే అని చెబుతూ పోతున్నారు. కానీ.. దీనిపై పీఎం మోదీ మాట్లాడటంలేదు’అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News